Cody Gakpo Emotional: క్రీడాకారులు క్రీడా మైదానంలోకి అడుగు పెట్టారంటే వారు ఎలా ఆడుతున్నారు? ఏం తప్పులు చేశారు? అనే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం.. కానీ, గుండెలు పగిలే బాధను పంటి బిగువున అణచివేసి దేశం కోసం బూట్లు తొడిగే ప్లేయర్స్ ఎందరో ఉంటారు. తాజాగా ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ పోరులో నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ కోడీ గాక్పో సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఈ లోకం చూడకుండానే తన కన్నబిడ్డ కన్నుమూసినా.. పుట్టెడు దుఃఖాన్ని మనసులోనే దాచుకుని, దేశం కోసం గ్రౌండ్ లోకి దిగి వరల్డ్ కప్‌లో అద్భుతమైన గోల్ సాధించి నిజమైన ఛాంపియన్‌గా అవతరించాడు.
గాక్పో మైండ్ బ్లోయింగ్ గోల్:
ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ (32 జట్ల రౌండ్) దశలో భాగంగా ఈరోజు ( మంగళవారం) తెల్లవారుజామున నెదర్లాండ్స్ వర్సెస్- మొరాకో జట్ల మధ్య హై-టెన్షన్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో తొలి 70 నిమిషాల పాటు మొరాకో జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ 72వ నిమిషంలో డచ్ స్టార్ ఆటగాడు కోడీ గాక్పో ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని నేరుగా నెట్లోకి పంపించి నెదర్లాండ్స్ 1–1తో స్కోరును సమం చేసింది.
గోల్ కొట్టినా నో సెలబ్రేషన్స్:
సాధారణంగా వరల్డ్ కప్ వంటి బిగ్ స్టేజీపై గోల్స్ చేసినప్పుడు స్ట్రైకర్‌తో పాటు జట్టు సభ్యులంతా మైదానంలో పరుగెడుతూ సంబరాలు చేసుకుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి హంగామా ఏమీ కనిపించలేదు.. స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంది. కోడీ గాక్పో గోల్ కొట్టగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మైదానంలోనే మోకాళ్లపై వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన తోటి ప్లేయర్స్ అతడిని ఓదార్చారు. గ్యాలరీలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న అభిమానులు కూడా ఈ విజువల్స్ కన్నీరు పెట్టుకున్నారు.
మూడు రోజుల ముందే బిడ్డ మరణం:
కోడి గాక్పో కన్నీళ్లకు కారణం.. ఈ మ్యాచ్‌కు సరిగ్గా మూడు రోజుల ముందే అతను తన బిడ్డను కోల్పోయాడు. గాక్పో పార్టనర్ నోవా వాన్ డెర్ బిజ్ గత శనివారం ఈ విషాదకర పబ్లిక్ మీడియా వేదికగా ఏర్పాటు చేయబడింది. ఈ భూమి మీద పడకుండానే (పుట్టకముందే) తమ బిడ్డను కోల్పోయామని వారు ప్రకటించారు. కోడీ గాక్పో, నోవా దంపతులకు 2025లో తొలి బిడ్డగా.. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి కొన్ని వారాల ముందే రెండో బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ బిడ్డను వారు కోల్పోవాల్సి వచ్చింది.
టోర్నీ నుంచి నెదర్లాండ్స్ ఔట్:
ఈ ఘోర దుఃఖ సమయంలో కోడి గాక్పో తన కుటుంబంతో ఉండేందుకు వీలుగా నెదర్లాండ్స్ యాజమాన్యం అతడికి సెలవు కూడా కల్పించింది. కానీ, ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యంత కీలకమైన నాకౌట్ దశ జరుగుతున్న వేళ.. జట్టును వీడేందుకు అతడి మనసు అంగీకరించలేదు.. అందుకే, బాధను మనసులోనే దాచుకుని మ్యాచ్ ఆడాడు. కానీ కోడి గాక్పో చేసిన పోరాటం వృథా అయ్యింది. నిర్ణీత సమయానికి స్కోర్లు ఈక్వల్ కావడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్‌ను మొరాకో ఓడించడంతో, డచ్ జట్టు ఈ వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
🧡😢L’image DE LA NUIT…
Endeuillé après లా మోర్ట్ డి సన్ enfant సూట్ à la fausse couche de sa femme survenue il ya 2 jours, Cody Gakpo a malgré tout tenu à jouer ce 16ème de finale de Coupe du Monde face au Maroc.
Il a ouvert le score à la 72ème నిమిషం మరియు n’a paspu retenir… pic.twitter.com/nZ1WKOwc1P
— RMC స్పోర్ట్ (@RMCsport) జూన్ 30, 2026
నెదర్లాండ్స్‌ను ఆధిక్యంలో ఉంచిన గోల్ చేసిన తర్వాత గాక్పో తన భావోద్వేగాలను అరికట్టలేకపోయాడు. డచ్ 🇳🇱 ఆటగాళ్లందరూ అతన్ని ఓదార్చడానికి వచ్చి అతనిని ఎలా కౌగిలించుకున్నారో చూడండి. 💔
pic.twitter.com/vb6FCKc0q9— లివింగ్ లివర్‌పూల్ (@Livin_Liverpool) జూన్ 30, 2026
కోడి గక్పో మార్కో కాంట్రా ఓ మర్రోకోస్ ఇ సే ఎమోషియోనౌ. ఓ జోగడోర్ డా హోలాండా ఇ సువా ఎస్పోసా పెర్డెరమ్ ఓ ఫిల్హో డురాంటే ఎ గెస్టాసో 🥺
📷 @CazeTVOficial #HOLxMAR pic.twitter.com/rwa2RQuiyB
— ఎడు (@edu9crf) జూన్ 30, 2026

