వైభవ్ సూర్యవంశీ: పొట్టి ఫార్మాట్లో 15 సంవత్సరాల బుడతడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం అంచనాలకు అందనిది. ఐపీఎల్ 2026లో సూర్య వంశీ అదరగొట్టాడు. 2:30 కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 776 పరుగులు చేశాడు. నారింజ రంగు టోపీని కూడా అందుకున్నాడు. ఆ స్థాయిలో ఆడిన ఇతడికి ఐర్లాండ్ టూర్ లో మేనేజ్మెంట్ ఆడే అవకాశం ఇవ్వలేదు.
అతడు ఆడకపోవడం.. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో.. విమర్శకులు మరింతగా రెచ్చిపోతున్నారు. మేనేజ్మెంట్ మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరుగుతోంది.. వైభవ్ సూర్య వంశీకి ఆడే అవకాశం ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మేనేజ్మెంట్ చేసిన తీరు ఏ మాత్రం సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్య వంశీని జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని అసిస్టెంట్ కోచ్ డస్కాటే బయటపెట్టాడు..”సరిగ్గా మూడు నెలల క్రితం టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించడానికి ప్రధాన కారణం సంజు శాంసన్. అతడు సీనియర్ ఆటగాడు. కొన్ని మ్యాచ్లలో విఫలమైన మాత్రాన అతని కోసం అద్భుతమైన ఆటగాడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అటువంటి ప్లేయర్లకు సుదీర్ఘమైన అవకాశాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని”డస్కాటే వ్యాఖ్యానించడం విశేషం.
ఈ ప్రకారం సూర్య వంశీకి టూర్ లో కూడా తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉండదు. సంజు, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లలో ఎవరో ఒకరు గాయపడితేనే సూర్య వంశీకి అవకాశం కల్పించాలి అంటే.. కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టూర్ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి.. ఒకవేళ మేనేజ్మెంట్ దీర్ఘంగా ఆలోచించి ఎవరికో ఒకరికి విశ్రాంతి ఇస్తే.. అప్పుడు సూర్య వంశీ జట్టులో అడుగు పెడతాడు.. అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా.. మైదానంలో సూర్య విహారం చేస్తాడా.. అనే ప్రశ్నలకు ఇంకా ఒకరోజు ఆగాలి. అప్పుడే వీటికి సమాధానం లభిస్తుంది.

