న్యూఢిల్లీ : కార్యనిర్వహణ ప్రయోజనాలను పెంచడానికి, వినియోగదారుల అనుభవాన్ని ఉన్నతీకరించడానికి, పలు వ్యాపార రంగాలలో పరిష్కారాలను సంయుక్తంగా రూపొందించేందుకు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మినీమైన్స్, ఈజ్వర్క్ ఐఐ, సర్వం ఏఐ, సిఫ్ట్లీ, కోడ్మెట్ ఐఐ అనే ఐదు స్టార్ట్అప్లను చేర్చింది. ఎంపికైన ఈ స్టార్టప్‌లు మారుతి సుజుకి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ (ఎమ్మెస్ ఐపి) 5వ కోహార్ట్ విజేతలు. ఎమ్మెస్ ఐపి ప్రోగ్రామ్‌ను, ఐఐఎం బెంగళూరు వ్యవస్థాపకత మరియు స్టార్టప్ మద్దతు ఇంక్యుబేషన్ హబ్ అయిన ఎన్ఎస్ఆర్సిఎల్ (నాదత్తూర్ ఎస్. రాఘవన్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూరియల్ లెర్నింగ్) భాగస్వామ్యం చేసారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్, సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, “మారుతి సుజుకి నిజమైన వ్యాపార సవాళ్లను విజయవంతంగా, ఆచరణాత్మకమైన పరిష్కారాలను రూపొందించడానికి స్టార్ట్అప్లతో కలిసి పనిచేస్తున్నారు.

