అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో రెండు లారీ ఢీకొనడంతో అగ్ని ప్రమాదం జరిగింది. బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

