– ప్రకటన –
- కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ వర్ధంతి
నవతెలంగాణ-హైదరాబాద్: కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్లో జీఎం రఘు అధ్యక్షతన సభ జరిగింది. ఈ ప్రముఖ అతిథిగా ప్రముఖ విశ్లేషకులు, ప్రజాశక్తి మాజీ బొర్డు మెంటర్ ఎం.కోటేశ్వర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారితో పాటు సంస్థ సీజీఎం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, బుక్ హౌస్ ఎడిటర్ ఆనందా చారి, సంస్థ సిబ్బంది పూలమాలలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వర రావు మాట్లాడుతూ..ఆప్యాయతతో అందర్నీ కలుపుకొని ఉద్యమంలో ముందుకు సాగారని, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించారని కొనియాడారు. క్షేత్రస్థాయిలో కార్మికులతో కలిసి పనిచేశారు, ఉన్నత కుటుంబాలలో పుట్టిన శ్రామికుల పక్షాల నిలబడి, వారి సమస్యల సాధన కోసం పోరాటం నడిపించారని తెలియజేశారు. వర్గ దృక్పథంతో పని చేసారు, కష్టజీవుల తరుపున గళమెత్తారు. సామాజిక రుగ్ముతలపై, కుల నిర్మూలన పోరాటాలకు దిక్సూచిగా వ్యవహరించారని కొనియాడారు.
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబరు 24న జన్మించిన కొరటాల 2006 జూలై ఒకటిన అనారోగ్యంతో మరణించారు. పూవు పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా అనుచితమైన డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా హైస్కూలులో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలోనూ, తరువాత 1975లో విధించిన అత్యవసర పరిస్థితిలో నాలుగేండ్లపాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. రైతు సంఘం రాష్ట్రనేతగానే కాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకునిగా కూడా ఆయన పనిచేశారు. ఎనభయ్యవ దశకంలో ప్రవేశించిన వ్యవసాయ పనుల కాంట్రాక్టు విధానం కార్మికులకు ఎలా నష్టదాయకమో కూడా ఆయన అధ్యయనం చేశారు.





– ప్రకటన –

