పవన్ కళ్యాణ్: ఈమధ్య కాలం సోషల్ మీడియాలో ట్రోల్స్ లిమిట్ అవుతున్నాయి. సామాన్యుల నుండి సినీ సెలబ్రిటీల వరకు, లోకల్ నాయకుల నుండి నేషనల్ లెవెల్ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు దారుణమైన ట్రోలింగ్స్ ని ఎదురుకుంటున్నారు. ఆడవాళ్లు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి ఈ సంస్కృతి ఎక్కడి వరకు వచ్చిందంటే, మన హిందూ దేవుళ్ళ పైన కూడా ట్రోల్స్ వేసే స్థాయికి చేరింది. పవిత్రమైన హైందవ ధర్మాన్ని ఈమధ్య కాలం లో కొంతమంది సెక్యులర్ ముసుగులో అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల దళిత క్రైస్తవులు మీటింగ్ ని నిర్వహించి జడ శ్రవణ్ కుమార్ , సీవీ రెడ్డి మరియు రావణ్ (ప్రశ్న) వంటి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై , డిప్యూటీ స్పీకర్ రామ కృష్ణం రాజు లపై రఘు నీచంగా మాట్లాడారు.
అదే విధంగా గతం లో ఈ రావణ్ అనే జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా మీద కూడా చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. హైందవ ధర్మాన్ని , శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటి అన్నింటిని పరిగణలోకి తీసుకొని , ఇతనిపై , సీవీ రెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు , హైదరాబాద్ కి వెళ్లి అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియా లో నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే కొంతమంది నెటిజెన్స్ పై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
దీని గురించి కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఒక విషయాన్నీ పవన్ చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేరస్థులకు, నేరానికి ఎలాంటి కులం , మతం లేదు, రాజకీయ పార్టీ లేదు, తప్పు చేసిన తర్వాత కులం , మతం , ప్రాంతం , రాజకీయ పార్టీల వెనుక దాచుకోవాలని చూడకండి. చట్టం ముందు అందరూ సమానులే, సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఒక్కటే భరోసా ఇస్తున్నాం , ఇక నుండి మీరు ఒంటరి కాదు , కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. డిప్యూటీ సీఎం ఆఫీస్ లో , సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్ , వీడియోలు మరియు ఇతర డిజిటల్ ఎవిడెన్స్ తో ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ఫిర్యాదును పరిశీలించి , సంబంధిత అధికారులతో చర్చించి , న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం మంచి నిర్ణయం @పవన్ కళ్యాణ్ గారు.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం – @పవన్ కళ్యాణ్ గారు.pic.twitter.com/3bYfQ6pC4d
— ట్రెండ్ PSPK (@TrendPSPK) జూలై 1, 2026

