నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. వీరిలో జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు మృతి చెందగా, 50 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరం ఖార్కివ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయగా మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.
పోస్ట్ ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా మొదట కనిపించింది నవతెలంగాణ.

