ఆంధ్రప్రదేశ్: కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలోకి వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్లో తనకు రాజకీయ భవిష్యత్ లేదని గ్రహించిన ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో జనసేనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. 2019, 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్ ఈసారి ఎలాగైనా చీరాల నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే తనకు జనసేన అయితే గెలుపు సులువు అని నమ్ముతున్నారు.
చీరాల నుంచి రెండుసార్లు గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ మరోసారి గెలుపు దక్కలేదు. 2009, 2014 ఎన్నికల్లో చీరాల నియోజకర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. తర్వాత మాత్రం కాంగ్రెస్ లో చేరినా ఆయనకు విజయం దక్కలేదు. దీంతో పాటు తనకు పట్టున్న, సొంత నియోజకవర్గమైన చీరాల నుంచి వైసీపీ నాయకత్వం తప్పించి పర్చూరు నియోజకవర్గానికి పంపింది. 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో తనకు ఇక రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో ఉండటంతో పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. అది తనకు కలసి వస్తుందని ఆమంచి కృష్ణమోహన్. తనకున్న సొంత బలంతో పాటు పవన్ కల్యాణ్ చరిష్మా కూడా తోడయితే గెలుపు ఖాయమని ఆమంచి కృష్ణమోహన్. జనసేనలో అయితే తనకు మరొకసారి గెలుపు ఖాయమని భావించిన ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరి జనసేన నుంచి ఆమంచి కృష్ణమోహన్ గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా? లేదా? అన్నది తేలుతోంది.

