హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతలు, మాజీ పోలీసు అధికారుల భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారడంతో భద్రత విషయంలో కుదించాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. 20 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
గన్ మెన్లను తొలగిస్తూ…
దీనితో పాటు గన్ మెన్ లను కూడా తొలగించింది. గతంలో మావోయిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీ భద్రత కల్పిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు రాజకీయ నేతలతో పాటు మాజీ పోలీసు అధికారులు కూడా భద్రతను కుదించారు.
వార్తల సారాంశం – తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది

