భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులోకి ఎప్పుడు అడుగుపెడతాడా అని చాలా మంది అభిమానులు సృష్టించారు. మరికొందరు అతడిని ఇంకాస్త సమయం తర్వాత జట్టులోకి తీసుకోవాలని అంటున్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వైభవ్ సిద్ధంగా ఉన్నాడు కానీ.. అరంగేట్రం చేయడానికి అందరికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ డస్కేట్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ వ్యాఖ్యలపై ఎబి డివిలియర్స్ విభేదించి.. వైభవ్‌కు మద్ధతుగా నిలిచాడు.
”వైభవ్‌ను ఎప్పుడు బరిలోకి దింపుతారు? ఐర్లాండ్‌తో సిరీస్ అతనికి మంచి అవకాశం. కానీ, ఆడలేదు. అది అత్యంత దురదృష్టకరం. సూర్యవంశీ కూడా ఇతర విషయాలతో ఆరంగేట్ర ప్రక్రియను అనుసరించాల్సిందేనని చెప్పిన భారత కోచ్‌తో నేను విభేదిస్తున్నాను. ఐపిఎల్2లో అతడి ఆట చూశాక.. ఇంకా ఆగడం ఎందుకు? ఐర్లాండ్‌పై ఆడిస్తే బాగుండేది. కాస్త అనుభవం వచ్చేది కదా. ఆ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టి20 రద్దు అయింది. ఇలాంటప్పుడే టీం ఇండియా బలంగా పుంజుకోవాలి. యుకెలో దూకుడుగా ఆడేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను అమలు చేయాలి. అక్కడ కూడా 250 లేదా 260 పరుగులు చేయలేదు. ఆ పిచ్‌లపై 160 రన్స్ కూడా మంచి స్కోరే అవుతుంది. అందుకు తగినట్లు వ్యూహాలను అమలు చేయాలి” అని డివిలియర్స్ సూచించాడు.

