గడచిన రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. అంతర్జాతీయంగా విశ్లేషకుల అంచనాలు, వడ్డీ రేట్ల పెంపుపై అనిశ్చితితో నిన్నటిదాకా పసిడి పరుగులు జరిగినప్పటికీ మళ్లీ క్రమంగా తగ్గటం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. వారాంతంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారా వారు ముందుగా తమ నగరంలో ధరలను పరిశీలించడం ముఖ్యం.
జూలై 4న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 3 కంటే గ్రాములకు 24 క్యారెట్ల బంగారం రేటు మొత్తం గ్రామానికి రూ.27 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం ధర రూ.14వేల 673గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 450గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 4, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా స్థిరంగా ఉంది. అంటే గ్రామం దాదాపు రూ.260 దగ్గర ఉంది.

