ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కొన్ని మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు 22 ఏలో చేర్చిన భూములపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 5వ తేదీన తిరుపతిలో సమావేశం పెట్టారు. బాధితులందరూ కదలి రావాలని ఏబీ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ ప్రాణం నాది.. ఈ భూములు నావి.. పూర్వీకులు ఇచ్చినవి.. తాము సంపాదించుకున్నవి.. స్వాధీనం చేసుకున్న మీరెవరు? ఈ పాలకులు ఎవరు? ఈ ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉంది? అంటూ ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 భూములు చేర్చిన భూములపై పోరాటానికి ఏబీ సిద్ధమయ్యారు.
2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉంది. అయితే ఆసమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. అయితే జగన్‌లో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు అనేక కేసులు ఎదుర్కొన్నారు. పదవీ విరమణ చేసే వరకూ ఏబీ వెంకటేశ్వరరావుకు పదవి కూడా నాటి వైసీపీ ప్రభుత్వంలో దక్కలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ కూటమి వెంకటేశ్వరరావుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ప్రభుత్వం నియమించింది. అయితే ఏబీ ఆ పదవి తనకు సరిపోదన్న భావనతో దూరంగా ఉన్నారు. ఒకరకంగా తిరస్కరించారు అని చెప్పాలి. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రశ్నిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక విషయాల్లోప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు.
ఇక విశాఖలో భూములు 9 పైసలకే ఇస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనపై కూడా ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తిని సంరక్షించేదిగా ఉండాలని, ఇలా పైసలకు పంచి పెట్టకూడదని ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏబీ చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్ కు ఇరకాటంలోకి నెట్టాయి. తాజాగా 22 భూముల విషయంలో ప్రజా పోరాటానికి ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధమవుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం భూములు లాక్కోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆస్తి హక్కుల కోసం చేతులు కలుపుదాం.. రోల్ బ్యాక్ 22 పేరుతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయన అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏబీ వెంకటేశ్వరరావు అంతిమ లక్ష్యం ఏంటన్నది భవిష్యత్ లో తేలుతోంది.

