అన్ని రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలి…
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) అనుమతిలో పూర్తి చేయడానికి క్షేత్రస్థాయి విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదు , అన్ని పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రైజ్ పై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు తమ పనితీరును మెరుగుపరుచుకొని ఓటర్ల జాబితా సవరణలో ఎటువంటి లోపాలు అవకతవకలు లేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలను సమానంగా పరిగణించి చట్టాలు నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు. పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా అప్పగించిన విధులను నిర్వర్తించాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి అక్రమాలకు పాల్పడిన అనధికారికంగా ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎన్రోల్మెంట్ ఫారాలను అందజేయడంతో పాటు పాత ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామాలో ఓటరు లేకపోతే వారి కొత్త చిరునామా వివరాలను నమోదు చేసి నమోదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా ప్రభుత్వ యోగ అవకాశాలను సద్విని చేసుకో
వాలని ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని అలాగే ఆయా వార్డుల బిఎల్ ఏలు ఇన్చార్జిలు బిఎల్ఓకు కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సహకరించాలని సూచించారు. సర్ ప్రైజ్పై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి మరింతగా అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు అయ్యేలా చూడాలని ఎవరు కూడా ఓటు కోల్పోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడాన్ని పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన ప్రతిఫరాన్ని వెంటనే డిజిటలైజేషన్ చేయడానికి జిల్లా కలెక్టర్ బిఎల్ఓలను స్వాధీనం చేసుకున్నారు. గడువు సమీపిస్తున్నందున రోజువారీ లక్ష్యాలను పెంచుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎనిమరేషన్ ఫారాలను పెండింగ్లో ఉంచకుండా ఓటర్ వద్ద డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మిగిలి ఉన్న ఫారాలను రాజకీయ పార్టీల బిఎల్ఎ లతో సమన్వయం చేసుకొని వెంటనే పంపిణీ చేయాలన్నారు. మొత్తం 20 38 5 2 7 మంది ఓటర్లు గాను నేటికీ 81 69 81 దాకా డిజిటల్ జరిగింది.
రేపటి రోజున ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంటింటికి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొన్నిచోట్ల ఆయా పార్టీలు బిఎల్ఏ లోను ఇంతవరకు నియమించలేదని వెంటనే ఆయా కేంద్రాల్లో బిఎల్ఏలను నియమించాలని తెలిపారు.
అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కొంతమంది బిఎల్ఓలు సక్రమంగా పనిచేయడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తెలుపగా జిల్లా కలెక్టర్ స్పందించి వారి వివరాలు ఇస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మాలోలఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ కనకరాజు ,ఎస్.ఏ. శామ్యూ బెంజిమెన్, టిడిపి పార్టీ తరపున నారాయణస్వామి, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు,ఈశ్వర ప్రసాద్, వైయస్సార్సీపీ సోమశేఖర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఇండియన్ కాంగ్రెస్ ఇమాం, ఆప్ మసూద్ వాలి చేస్తున్నారు.

