భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు.
బిష్ణోయ్ వేసిన నోబాల్స్, ఫ్రీ-హిట్లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదడంతో పాటు లక్ కలిసి వచ్చి రెండు నో-బాల్స్ లభించాయి. ఈ వీరవిహారంతో బెథెల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగులు పూర్తి చేసి మ్యాచ్‌ను ఇంటి వైపు తిప్పేశాడు. బిష్ణోయ్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 60 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా అతడు 17వ ఓవర్లో వరుసగా నోబ్, 6, నో బాల్, 6, 2, 4, 6, 2 పరుగులు చేశాడు.
చివరికి సామ్ కర్రన్ (7) వికెట్ పడినా, బెథెల్ (46 బంతుల్లో 76 పరుగులు) క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా 6 బాల్స్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘోర పరాజయంతో సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.

