మా ఇంటి బంగారం 15 రోజుల కలెక్షన్స్ : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని , రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న కొత్తగా రెండు సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 15 వ రోజున 45 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ప్రాంతాల వారీగా ఈ చిత్రం 15 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి , ఎంత లాభాలు వచ్చాయి , ఇంకా ఎంత లాభాలు రావొచ్చు అనేది ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందజేసే సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజా ప్రాంతం నుండి దాదాపుగా 13 కోట్ల 87 లక్షల రూపాయల షేర్ వసూళ్లు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 10 కోట్ల 56 లక్షలు రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటి వరకు 24 కోట్ల 43 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 47 కోట్ల 25 లక్షల వరకు వచ్చింది. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 86 లక్షలు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్లు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 41 కోట్ల 69 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 84 కోట్ల 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
లాభాలు దాదాపుగా 29 కోట్ల 69 లక్షల రూపాయిలు రాగా, మరో 5 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు అదనంగా లాంగ్ రన్ లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించకపోవడం తో , ఈ సినిమా ఓటీటీ లో కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి థియేట్రికల్ రన్ ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతిష్టాత్మక వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరుతుందో లేదో చూడాలి.

