Nagabandham Day 1 Collections : విడుదలకు ముందు ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన చిత్రాలలో ఒకటి ‘నాగబంధం’. కొత్త హీరో పై వంద కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేయడం తో , ఈ సినిమాలో ఎదో విషయం ఖచ్చితంగా ఉంటుందని ఆశించారు. పైగా అనంత పద్మనాభ స్వామి గుడిపై తీస్తున్న సినిమా కావడంతో , ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూశారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అనేక మంది ఆడియన్స్ థియేటర్లు కి వెళ్లి నిద్రపోయాము అంటూ సోషల్ మీడియాలో వీడియోలు సైతం అప్లోడ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయినప్పటికీ కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉండటం వల్ల, ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ ఈ ఓపెనింగ్స్ నిర్మాతకు బడ్జెట్ రీకవరీ కి ఏ మాత్రం సరిపోవు అనేది వాస్తవం. ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లు వచ్చాయో , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా ఎంత వసూళ్లు రావాలి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ట్రేడ్ విశ్లేషకులు అందించే లెక్కల ప్రకారం చూస్తే ఈ మొదటి రోజు నైజాం ప్రాంతం 1 కోటి 73 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 1 కోటి 32 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు , 1 కోటి 60 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే కర్ణాటక నుండి 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 55 లక్షలు, ఓవర్సీస్ నుండి 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 4 కోట్ల 75 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా మినిమం రేంజ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. దాదాపుగా అధ్యాయం కాబట్టి , ఈ ఏడాది అది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒక్కటి చూడొచ్చు. ఈ సూచన అడ్వాన్స్ కట్టిన బయ్యర్స్ కి ఒక్క పైసా కూడా మిగిలే పరిస్థితి లేదు , ఇక నిర్మాత పరిస్థితి ఊహిస్తేనే ఏడుపొస్తోంది అంటూ నెటిజెన్స్ బాధపడుతున్నారు.

