- విడుదలైన TGEAPCET మాక్ సీట్ల కేటాయింపు
- 8,740 మందికి సీట్లు దక్కని పరిస్థితి
- కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్
- జూలై 7లోపు వెబ్ ఆప్షన్లు మార్చుకునే ఛాన్స్
తెలంగాణ టీజీఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా అభ్యర్థుల అవగాహన కోసం అధికారులు మాక్ సీట్ల కేటాయింపు (మాక్ సీట్ కేటాయింపు) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య, అక్కడ ఉన్న సీట్లకు మధ్య గట్టి పోటీ ఉంది. మొత్తం 88,053 సీట్లు అందుబాటులో ఉండగా, 88,062 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మాక్ అలాట్మెంట్లో 79,313 మందికి సీట్లు లభించగా, ఆప్షన్లు ఇచ్చినప్పటికీ సరైన కట్-ఆఫ్ లేకపోవడం వల్ల 8,740 మంది అభ్యర్థులకు సీట్లు దక్కలేదు. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కింద 6,261 మంది అభ్యర్థులకు మాక్ సీట్లు కేటాయించారు. అయితే, ఈ మ్యాక్ కేటాయింపులు కేవలం తాత్కాలికమేనని, అభ్యర్థులు తమ ఆప్షన్ల కోసం సరిచూసేందుకు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. జూలై 5 నుండి 7వ తేదీ వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి లేదా మరిన్ని కొత్త ఆప్షన్లను జోడించుకోవడానికి అవకాశం కల్పించారు. జూలై 7న ఫ్రీజ్ అయ్యే ఆప్షన్ల ఆధారంగా మొదటి విడత అసలు సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, ఈ మాక్ కేటాయింపులో ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేయలేదు.
ప్రైవేట్ వర్సిటీల్లో ఫుల్ రష్.. కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్
మాక్ కేటాయింపుల సరళిని అంచనా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ప్రైవేట్ యూనివర్సిటీలు అత్యధిక ఆదరణ పొందుతూ 100 శాతం సీట్ల భర్తీని నమోదు చేయగా, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 90 శాతం, ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో 85 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఎప్పటిలాగే కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేక కోర్సుల్లో ఏకంగా 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. వీటితో పాటు కోర్ సీఎస్ఈ (సీఎస్ఈ)లో 95 శాతం, సీఎస్ఈ ఏఐ అండ్ ఎంఎల్లో 93 శాతం, ఎస్ఈఎస్ఈ డేటా సైన్స్‌లో 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ , కోర్ గ్రూపుల విషయానికి వస్తే ఈసీఈ (ECE)లో 89 శాతం, ఈఈఈ (EEE)లో 73 శాతం సీట్లు భర్తీ కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 81 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 76 శాతం సీట్లు మాక్ అలాట్మెంట్లో భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, మాక్ అలాట్మెంట్లో సీటు రాణి వారు , తక్కువ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు నిరాశ పడకుండా, మెరుగైన కాలేజీలు , కోర్సులను దక్కించుకోవడం కోసం జూలై 5 నుంచి 7 వరకు మరిన్ని ఎక్కువ ఆప్షన్లను వెబ్సైట్ కౌన్సిలింగ్లో నమోదు చేయాలని అధికారులు సూచించారు.

