హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్ట్ కెవిఆర్ భార్య విజయలక్ష్మిపై ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. బొబ్బిలి పోలీసులు జరలిస్ట్ కెవిఆర్‌ను అరెస్టు చేయడానికి సరూర్‌నగర్ వెళ్లారు. భర్తను అరెస్టు చేస్తుండగా భార్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. తమ విధులకు ఆటంకాన్ని కలిగించిందని బొబ్బిలి పిఎస్‌లో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు., ఈ ఆమెను ఆమెను అడ్డుతొలగించుకోవడానికి ఆమెను సిఐ గట్టిగా పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ విజయలక్ష్మి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కెవిఆర్ భార్యతో సిఐ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో బొబ్బిలి సిఐ శ్రీనివాస్‌పై బదిలీ వేటు వేశారు. సిఐ శ్రీనివాస్‌ను విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాజ్యాంగంపై జర్నలిస్టు కెవిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాడండి మండలానికి చెందిన సర్పంచ్ ఫిర్యాదు మేరకు బొబ్బలి పోలీసులు కెవిఆర్‌ను అరెస్టు చేసేందుకు సరూర్‌నగర్ వెళ్లారని డిఎస్పి గోవిందరావు తెలిపారు. పోలీసుల విధులకు కెవిఆర్ భార్య విజయలక్ష్మి ఆటంకం కలిగించడంతో సిఐ ఫిర్యాదు మేరకు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. విచారణ చేయవలసిందిగా సరూర్‌నగర్ పోలీసులకు రిఫర్ చేశామని డిఎస్ పి వివరించారు. సిఐ శ్రీనివాస్‌పై కూడా విజయలక్ష్మి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

