బాలకృష్ణ కొరటాల శివ సినిమా: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఆయన కథల విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇంతకుముందు వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా విషయంలో కొంతవరకు తడబడ్డాడు. అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. అది ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఇందులో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక కొరటాల కి ఫుల్ స్వేచ్ఛని కూడా ఇచ్చారట. తను ఎలాగైతే అనుకుంటున్నాడో దాన్ని అలాగే తీర్చిదిద్దామని దానికోసం ఎంత రిస్క్ అయినా సరే తను చేస్తానని చెప్తున్నాడట. కొరటాల శివ స్క్రిప్ట్ చూసి బాలయ్యకు చాలా సంతోషం వేస్తుందట.
ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అలాంటి స్క్రిప్ట్ తో సినిమా చేయలేదు. కాబట్టి ఆ స్క్రిప్ట్ కి తను పూర్తిగా సరెండర్ అయిపోయి దర్శకుడు ఏం కావాలంటే అది చేయడానికి తన సిద్దంగా ఉన్నారట. మొత్తానికైతే కొరటాల – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలువబోతోందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
తన కెరియర్ లో ఆచార్య సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధించాడు. మరోసారి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్తాడా? లేదంటే డౌన్ ఫాల్ అయిపోతాడా అనేది తెలియాలంటే బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

