India Engineering Colleges Closure: మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. అంతకుముందు వివిధ రాజులు.. కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవానికి సరికొత్త దిశ దశ చూపించారు. ఆయన చూపించిన తోవలోనే చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు పనిచేస్తున్నారు. ఆయన పేరును నిత్యం స్మరించుకుంటూ ఉంటారు.
మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవం ఈనాటిది కాదు. దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.. మన పురాణం.. చారిత్రక గాథల్లో ఇంజనీరింగ్ నైపుణ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆలయాలు.. పెద్దపెద్ద నిర్మాణాలు ప్రపంచ వింతలను మించిపోతాయి. ప్రపంచ వింతలు 7 అని చెబుతుంటాం కదా.. నిజానికి ఆ ఏడు కూడా మనదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే తాజ్ మహల్ కు మాత్రమే చోటు దక్కింది.. సున్నా కనిపెట్టిన ఆర్యభట్టు.. రాతి నిర్మాణాలలో సరికొత్త చరిత్ర సృష్టించిన పల్లవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది.
ఈ స్థాయిలో గుర్తింపు పొందిన మన దేశంలోనే ఇంజనీరింగ్ వ్యవస్థ క్రమంగా తన ప్రభను కోల్పోతోంది. ముగింపు దశకు వచ్చినట్టు. మనదేశంలో ఇంజనీరింగ్ వ్యవస్థలో నిశ్శబ్దంగా సంచలనం నమోదవుతోంది. ఏఐసిటిఈ ప్రకారం 2025 -26 విద్యా సంవత్సరంలో మనదేశంలో మొత్తంగా 58 ఇంజనీరింగ్, సాంకేతిక కళాశాలలను దశలవారీగా మూసి వేయబోతున్నారు. అంతేకాదు 950 కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలలో సాంకేతిక కోర్సులను అందించబోతున్నారు. ఎప్పుడు చదువుతున్న విద్యార్థులను వారి డిగ్రీని పూర్తి చేయడానికి అనుమతిస్తారు. ఇకపై ఈ విద్యాసంస్థలు కొత్తగా మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకోవడం. అత్యధిక సంఖ్యలో కాలేజీలు మూసి వేతకు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ముందు వరసలో ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
తక్కువ విద్యార్థుల నమోదు.. అధ్యాపకుల కొరత.. నియంత్రణ నిబంధనలు పాటించడంలో విఫలం వంటి కారణాల వల్ల మూసివేతలు జరుగుతున్నాయి.. ఇదే పరిశీలన ఏఐసీటీఈ తన నివేదికలో. మరోవైపు ఈ పరిణామాన్ని ఇంజనీరింగ్ నిపుణులు మరో విధంగా చెబుతున్నారు. నేటి కాలంలో ఇంజనీరింగ్ కంపెనీల లక్ష్యాలు మారిపోయాయని.. అటువంటి విద్యాసంస్థల్లో చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

