భూపాల్ నాయక్ మోసం: పాలేరుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో చేరాడు. అనంతరం రకరకాల పనులు చేశాడు. వేషం మార్చాడు. సొంత ఊరికి వచ్చాడు. ఎకరాల భూమి కొన్నాడు. అందులో చేపల చెరువులు తవ్వించాడు. చుట్టూ బౌన్సర్లు.. ఖరీదైన కార్లు.. రేమాండ్ సూట్లు.. బాటా బూట్లు.. చేతికి రోలెక్స్ గడియారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రేంజ్ మామూలుగా లేదు. ఒక పాలేరు నుంచి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని పాజిటివ్ కోణంలో కాకుండా.. మరో కోణంలో చూస్తే.. చూడ్డమేంటి ఆయన చేసింది అదే.. చివరికి ఏం జరిగిందంటే..
అతని పేరు నేతావత్ భూపాల్ నాయక్. మహబూబాద్ జిల్లా కురవి మండలం కందికొండ ప్రాంతం.. ఇతడు కిసాన్ పరివార్ లిమిటెడ్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత డిపాజిట్లు వసూలు చేశాడు. అసలు రెట్టింపు అని ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఏకంగా కొన్ని కోట్ల వసూలు చేశాడు. వాస్తవానికి ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టకూడదని.. అవి పూర్తిగా నిషేధమని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2022లో జూలైలో ఒక ప్రకటన విడుదలైంది. అయినప్పటికీ ఆ ప్రకటనను దాస్తూ భూపాల్ నాయక్ వందలాది మంది రైతులను మోసం చేశాడు. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ ఏర్పాటు డోర్నకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఆశించాడు. కాంగ్రెస్ పోటీ చేస్తానని ప్రకటించాడు. భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు.. సమావేశాలు భారీగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు ఇచ్చట్టు బిల్డప్ కూడా చేశాడు.
కోట్ల వసూలు చేసిన భూపాల్ నాయక్ అనేక డొల్ల సంస్థల్లోకి వాటిని మళ్లించాడు. దీనికోసం 30 నుంచి 40 వరకు బ్యాంకుల ఖాతాలు ఉపయోగించుకున్నాడు. ఆ డబ్బులను తన అవసరాల కోసం మళ్లీ ఖాతాలలోకి మళ్లించి ఉపయోగించుకున్నాడు. ఇతడు ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో భూపాల్ నాయక్ మాత్రమే కాకుండా.. ఇంకా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు ఉన్నారు. కిసాన్ పరివార్.. షేర్లు బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అత్యంత మోసపూరితమైనవి కాకపోతే ఆ ప్రకటనను బయటికి రాకుండా చూసుకోగలిగాడు భూపాల్ నాయక్. చివరికి ఇతడి వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాము పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి అందించిన బాధితులు ఇతడిని డిమాండ్ చేశారు. దీంతో అతడు ఒక మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించాడు. ఈ వారంతా కూడా ఈ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.. వారు లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి భూపాల్ నాయక్ అసలు రంగును బయటపెట్టారు. ఇతడి దందా వందల కోట్లలో సాగిన నేపథ్యంలో.. ఈడి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

