అఖిల్ అక్కినేని : దాదాపుగా మూడేళ్ళ సుదీర్ఘ గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంతో ఈ నెల 10న మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అక్కినేని అఖిల్ కూడా ఇంటర్వ్యూలు నాన్ స్టాప్ గా ఇస్తూనే ఉన్నారు. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది , మూవీ బాజ్ కి ఈ ప్రొమోషన్స్ మంచి బూస్ట్ ఇచ్చింది. దీనితో అడ్వాన్స్ బుకింగ్స్ , ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా బజ్ కి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వేరే లెవెల్ బూస్ట్ ఇవ్వనున్నారు.
ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు. కాసేపటి క్రితమే అఖిల్ ఎన్టీఆర్ ని కలిసి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్తుండడం, అనంతరం అఖిల్ ని ప్రేమగా హత్తుకోవడం చూడొచ్చు. అభిమానులు ఈ ఆనందాన్ని పంచుకుంటూ , అప్పట్లో ఎన్టీఆర్ , ఏఎన్నార్ ఆత్మీయంగా హత్తుకున్నా ఫొటోలతో పోలుస్తూ యాదృచ్ఛికం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ కి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు మహేష్ బాబు లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ముగ్గురు గతం లో అఖిల్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే అఖిల్ ని తన సొంత తమ్ముడిగా భావిస్తారు. చిరంజీవి , నాగార్జున ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో , అఖిల్ , రామ్ చరణ్ అంతకు మించి సాన్నిహిత్యం తో ఉంటారు.
ఇలా స్టార్ హీరోలందరితో మంచి రిలేషన్స్ ని మైంటైన్ చేస్తూ , వాళ్ళ అభిమానుల సపోర్టు ని కూడా సొంతం చేసుకున్నారు అఖిల్. ఇలా అన్నీ కలిసి వస్తున్నప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడం బాధాకరం. లెనిన్ చిత్రంతో ఆ బాధకు ఫుల్ స్టాప్ పడుతుందని , కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఆయన అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ‘లెనిన్’ నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.
ధన్యవాదాలు టైగర్. గర్జించినందుకు ధన్యవాదాలు #లెనిన్.
ఎప్పటికి మరిచిపోలేనంత ప్రేమ ఇచ్చావు. లవ్ యూ బ్రదర్ @tarak9999 ❤️ pic.twitter.com/D2Xd0pZDpH
— అఖిల్ అక్కినేని (@AkhilAkkineni8) జూలై 6, 2026

