బ్రిటన్: ఆటలో గెలిచిన తర్వాత ప్లేయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కామన్. కొందరు విజయాన్ని నార్మల్‌గా సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు అగ్రెసివ్‌గా విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ ఓవర్ సెలబ్రేషన్సే ఫుట్ బాల్ జట్టు కొంపముంచాయి. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్, మెక్సికో జట్లు తలపడ్డాయి.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 3-2తో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ క్వార్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆ జట్టు పెద్ద ఎత్తున విన్నింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వసతి సీనియర్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ గాయపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ అభిమానులతో సంబరాలు చేసుకుంటున్న సమయంలో హెండర్సన్ అడ్వర్టైజింగ్ హోర్డింగ్ (ప్రకటనల బోర్డు) పైనుంచి దూకడానికి ప్రయత్నించి అతని మణికట్టుకు తీవ్రంగా గాయపడింది.
అతడిని పరీక్షించిన వైద్యులు గాయం ఎక్కువగా ఉండటంతో సర్జరీ తప్పదని చెప్పారు. దీంతో ఫిఫా వరల్డ్ కప్ నుంచి హెండర్సన్ అర్ధాంతరంగా నిష్క్రమించాడు. టోర్నీ కీలక సమయంలో హెండర్సన్ దూరం కావడం చాలా పెద్ద దెబ్బ అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అతి విన్నింగ్ సెలబ్రేషన్స్ కొంపముంచాయి.

