సీనియర్ నటుడు నరేష్: ఏపీలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. మొన్నటి వరకు సామాజిక వర్గాలపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ అది కామన్. కానీ ఈసారి కులం కాకుండా మతం బయటకు వచ్చింది. ముఖ్యంగా క్రైస్తవ, దళిత అంశం తెరపైకి వచ్చింది. అయితే దీని ఉన్న రాజకీయ శక్తుల గురించి దాదాపు ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఈ విషయం పైనే సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. 1న ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు వస్తాయని.. దానికి రాజకీయ శక్తులు తోడవాలన్నారు.. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఇది సవాల్ అని.. దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయబోతున్నారు అంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
*గత కొద్ది రోజులుగా పరిణామాలతో..
కొద్దిరోజుల కింద దళిత, క్రైస్తవ శంఖారావసభ జరిగింది. ఇదే సభలో ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో హిట్ పుట్టాయి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మూలంగా ఆయన అరెస్టు కూడా జరిగింది. ఉగ్రవాద చర్యలకు సంబంధించిన చట్టాల్లో ఉన్న కేసులను నమోదు చేశారు. ఆయన అరెస్టు తరువాత రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం సిద్ధపడింది. ఈ అరెస్టును తప్పుపడుతూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిని ఊహించిన నటుడు నరేష్ ఒకానొక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో మతపరమైన గొడవలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం వచ్చేలా ఆయన పోస్ట్ చేశారు.
* మత రాజకీయాలకు దూరం..
ఏపీలో ఇప్పటివరకు కేవలం కుల రాజకీయాలు మాత్రమే నడిచాయి. మతపరమైన వివాదాలకు సంబంధించి ఎవరు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సాహం అందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మతపరమైన రాజకీయాలు నడిచేవి. కానీ ఇప్పుడు దళిత క్రైస్తవుల పేరుతో రాజకీయం మొదలైంది. దానికి ప్రేరేపిత రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఇప్పుడిప్పుడే స్పష్టత కూడా వస్తోంది. తెర వెనుక రాజకీయం నడుపుతున్న పార్టీలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. అయితే దీనివల్ల దళితులతో పాటు క్రైస్తవుల ఓట్లు దక్కుతాయి అనేది ఒక ఆలోచన. ఒక ఏపీలోనే కాదు ఇదే ఫార్ములా తో ముందుకెళ్లే ఆలోచనతో కొన్ని శక్తులు కనిపిస్తున్నాయి సినీ నటుడు నరేష్ అనుమానిస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలతో పాటు దేశ ప్రజలను ఆయన హెచ్చరిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం నేను ఈ ట్వీట్ చేసినప్పుడు, తమిళనాడు ఎన్నికలపై నా జోస్యం వలె ప్రజలు నన్ను తేలికగా తీసుకున్నారు. నేడు ఈ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక మతం: రాజకీయ కుట్ర ఉందని నేను స్పష్టంగా పేర్కొన్నాను. గుండెపోటుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్సార్సీపీ, వామపక్షాలు… pic.twitter.com/n0yYeRnIYS
— నరేష్ విజయ కృష్ణ (@ItsActorNaresh) జూలై 6, 2026

