Mahesh Babu Srirama Look : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ‘వారణాసి’ మూవీ అప్డేట్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షూటింగ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ గ్లింప్స్, సంచారి సాంగ్ , రణకుంభ థీమ్ సాంగ్స్ మాత్రమే వచ్చాయి. సినిమాపై భారీ హైప్ ని పెంచే టీజర్ అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈ చిత్రం లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లో కనిపించబోతున్నాడని , అందుకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసిందని రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. తన మొబైల్ వాల్ పేపర్ కూడా మహేష్ శ్రీరాముడి లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని పెట్టుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు . రీసెంట్ గానే మహేష్ శ్రీరాముడి లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే అవన్నీ AI ద్వారా క్రియేట్ చేయబడిన ఫోటోలు అట. మహేష్ బాబు నిజమైన శ్రీరాముడి లుక్ ని రివీల్ చేసే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఈ టీజర్ లో మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లో కనిపిస్తారట. అభిమానులకు ఆ లుక్ ని చూసిన తర్వాత గూస్ బాంప్స్ వస్తాయని , ఆ షాట్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని , వారణాసి చిత్రం గ్లోబల్ వైడ్ గా సృష్టించబోయే వసూళ్ల సునామీ కి ఈ టీజర్ ఒక చిన్న శాంపిల్ గా నిలుస్తుందని అంటున్నారు. ఒక్క షాట్ కే అభిమానులు ఏమైపోతారో అనే వైబ్స్ ఉన్నాయ్ , ఇక సినిమాలో మహేష్ బాబు ఈ గెటప్ లో 20 నిమిషాలకు పైగా ఉంటారట. ఇక వెండితెర మీద రాజమౌళి విజన్ లో మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా మెరిసిపోతారో ఇప్పటి నుండే ఊహించుకోండి.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోపు పూర్తి చేయాలని టార్గెట్ తో ముందుకు దూసుకెళ్తున్నారు రాజమౌళి. నిన్నటి నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ పాన్ ఇండియన్ విజువల్ వండర్ ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. #RRR తో ఇంటర్నేషనల్ మార్కెట్ విండో ని ఓపెన్ చేసిన రాజమౌళి , ‘వారణాసి’ చిత్రంతో ఏకంగా హాలీవుడ్ రికార్డ్స్ పై కన్నెశాడా ? అనేది చూడాలి.

