అమరావతి: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామంలో గంగరాజు(37). సునీత(32) అనే దంపతులు సమకూర్చారు. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చితకబాదాడు. వీరితో బంధువులు సునీతో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. భర్త కదిరి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి భార్య వైద్యశాలలో మెరుగైన చికిత్స అందిస్తానని అందరినీ నమ్మబలికాడు. మహిళా వార్డు నుంచి బయటకు రాగానే కత్తి తీసుకొని భార్య గొంతుకోసి చంపేశాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

