అక్కినేని అఖిల్ హీరోగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్‘. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అవుతుందని ధీమాగా ఉంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ సినిమా టికెట్ ధరలకు సంబంధించిన ఒక సానుకూల వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తే కొత్త సామాన్య ప్రేక్షకుల థియేటర్లకు రావడానికి కాస్త వెనకాడుతున్నారు. అయితే ‘లెనిన్’ చిత్ర బృందం ప్రేక్షకులకు ఎటువంటి భారం పడకుండా చాలా రీజనబుల్ అండ్ అర్డబుల్ ప్రైసింగ్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఈ చిత్రం చాలా అనుకూలమైన ధరలను ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ. 250 టికెట్ ధరలను ఫిక్స్ చేసారు. ఈ రీజనబుల్ ప్రైసింగ్ స్ట్రాటజీ ఖచ్చితంగా సాధారణ ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద సంఖ్యలో థియేటర్లకు అందించడానికి హెల్ప్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు. నార్మల్ ప్రైసింగ్ తో పాటు ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ భారీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

