అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ఇక ముగిసినట్టేనని సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో చర్చలు కొనసాగించే సమయం వృథా అంటూ ఉంది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలు కొనసాగించాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్ పోర్టు నగరాలు, ఖేష్మ్ ద్వీపంలోని లక్ష్యాలపై విరుచుకుపడింది. అదే సమయంలో ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ”నా దృష్టిలో ఇరాన్‌తో చర్చలు ముగిశాయి. వారితో ఇక చర్చించాలని నాకు లేదు. వాళ్లతో చర్చలు జరపడం సమయం వృథాణ్ణ అని తెలియజేసారు.
ఇరాన్ నాయకత్వంపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ”వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. అణ్వాయుధాలు వారి చేతికి వస్తే కచ్చితంగా వాడండి. అందుకే నా దృష్టిలో చర్చలు ముగిసినట్టే.

