నవతెలంగాణ-సారంగాపూర్
చేత చించోలి (బి) గ్రామంలో నిర్మల్ రూరల్ సిఐ. యం. కృష్ణ గ్రామస్తులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రత కోసం సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వ్యాపారస్థులు వారి సముదాయాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్పందించిన గ్రామ సర్పంచ్ సాయన్న, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.
అనంతరం వనమహోత్సవంలో భాగంగా గ్రామస్థులతో కలిసి అరె మైసమ్మ దేవాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్,గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, పంచాయితీ సెక్రటరీ సౌజన్య గ్రామస్తులు.
పోస్ట్ గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ మొదట కనిపించింది నవతెలంగాణ.

