యువర్స్ ఫౌండేషన్ చైర్మన్ దేవత సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ దేవతా సుబ్రహ్మణ్యం, యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి రేణింట వెంకట నాగర్జున మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో కంటి వైద్యులు 80 మంది రోగులను పరీక్షించగా అందులో 30 మంది కంటి ఆపరేషన్‌కు ఎంపిక చేసినట్లు గుర్తించారు. ఈ శిబిరానికి దాతలుగా వృద్ధి హోం ఫైనాన్స్ వారు వ్యవహరించడం జరిగింది. అనంతరం కంటి వైద్యులు గంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. అనంతరం ఎంపికైన వారందరినీ కూడా బెంగళూరు ప్రత్యేక బస్సులు ఆపరేషన్ నిమిత్తం పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఆర్వో రాధాకృష్ణ, సికిందర్, గర్రె రమేష్ బాబు, కృష్ణమూర్తి, కళ్యాణ్, మోహన్, డాక్టర్ బి వి సుబ్బారావు జరిగింది.

