తెలంగాణ:నల్లగొండ జిల్లా నార్కట్పల్లి (నార్కెట్పల్లి)పట్టణ మండలం గత మూడు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జైంట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ,రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు, వ్యాపారులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను వెంటనే ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్ష పట్టణంలోని వ్యాపారులు,ఆటో యూనియన్ నాయకులు,వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు,ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసారు జేఏసీ నాయకులు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిరుమర్తి యాదయ్య,చింతపల్లి భయ్యాన్న, వడ్డేపల్లి నాగరాజు,లింగాల యాదయ్య,మరిది శివకృష్ణ,దుబ్బాక శ్రీధర్,కొప్పు శ్రావణ్,అల్లె పరమేష్,దోసపాటి విష్ణుమూర్తి,బొబ్బలి దేవేందర్, దండు రవి,పసునూరి శ్రీనివాస్, పుల్లెంల వెంకట్,చెన్నారపు రాజు, సత్తయ్య,చెన్నారపు సత్తయ్య, హరీష్, వెంకన్న,బొబ్బలి మహేష్,మంద సుధాకర్,అశోక్,నరేష్ కొనసాగుతున్నారు.

