ఆంధ్రప్రదేశ్:ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై(ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఫ్లైఓవర్‌పై లారీలు నిలిపి ఘర్షణ పడుతున్న ఇద్దరు లారీ డ్రైవర్లపైకి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.ఫ్లైఓవర్‌పై రెండు లారీలను నిలిపిన డ్రైవర్లు పరస్పరం ఘర్షణ పడుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు వారిని ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాద తీవ్రతకు ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోగా,బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన ప్రయాణికులకు వైద్యం అందించడంతో పాటు మృతదేహాలను ఆసుపత్రికి అందించారు.ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

