ఫిలిం ఇండస్ట్రీలో కలిసి పని చేయడం వల్ల ఇద్దరు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం మామూలే. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టిన తరుణ్ భాస్కర్.. ఈషాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో నటించాడు. ఐతే ఈ సినిమా చేస్తున్నపుడే తరుణ్, ఈశాల మధ్య రిలేషన్షిప్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.
త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే చర్చ ‘ఓం శాంతి’ టైంలో జరిగింది. దీని గురించి ఆ సినిమా ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ ఓపెనయ్యాడు కూడా. కొన్నేళ్లుగా ఈషా తనకు తోడుగా ఉందని, తనకు అన్నీ ఈశానే అని కూడా అతను చూపించడం విశేషం. ఇందులో చెప్పడానికి, దాచడానికి ఏమీ లేదన్న తరుణ్.. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, సరైన సమయంలో తమ బంధం గురించి ప్రకటన చేస్తానని అతనన్నాడు.
ఐతే తరుణ్, ఈషా కలయికలో వచ్చిన ‘ఓం శాంతి శాంతి:’ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత వాళ్లిద్దరి గురించి చర్చ ఆగిపోయింది. దీనితో బాలీవుడ్ జంటల తరహాలోనే సినిమా ప్రమోషన్ కోసం ఈ టాపిక్‌ను తెరపైకి తెచ్చారా అనే డౌట్లు కలిగాయి. కానీ తరుణ్, ఈశాలది కేవలం సినిమాతో ముడిపడ్డ బంధం కాదని స్పష్టమైంది. తాజాగా ఈ జంట కలిసి కెమెరాలకు చిక్కింది. ఇద్దరూ ఎయిర్ పోర్టులో కలిసి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఏమీ చేయలేదు. తరుణ్ డైరక్టోరియల్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ మేకింగ్‌లో ప్రస్తుతం ఉంది. ఇలాంటి టైంలో ఈషాతో కలిసి కనిపించాడంటే వారి బంధం మీద ఒక క్లారిటీ వచ్చినట్లే. త్వరలోనే ఈ జంట శుభవార్త చెబితే ఆశ్చర్యమేమీ లేదు. ‘ఈ నగరానికి ఏమైంది-2’ నవంబరు 19న విడుదల. తరుణ్ భాస్కర్‌కు ఇంతకుముందే పెళ్లయి, విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

