పీఆర్ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి నటిస్తున్న చిత్రం ‘డ్యూడేట్’. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్.కె. దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా హీరో లోమేష్ పూడిపెద్ది, హీరోయిన్ జయశ్రీతో పాటు కీలక పాత్రలో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్‌పై చేసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా, సక్సెస్ఫుల్ నిర్మాత బన్నీవాస్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకుడు విజయ్ కనకమేడల, విఐఐలతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “ప్రస్తుత బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్డ్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. టైటిల్ దగ్గర నుంచి సినిమా ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి.

