ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, ఇదే జిల్లాకు చెందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరికి మధ్య పాత రాజకీయ కక్షలు ఉన్న విషయం. ఆ తర్వాత.. కడియం బీఆర్ ఎస్‌లోకి వెళ్లారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నా.. ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే.. నియోజకవర్గంలో ఎలా ఉన్నా.. జిల్లా మొత్తం మీద కడియం పైచేయి సాధిస్తున్నారన్న వాదన ఉంది.
ఈ నేపథ్యంలోనే తరచుగా కడియం వర్సెస్ కొండాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా కడియం శ్రీహరి.. దేవాదాయ శాఖ పనితీరుపై సమీక్షించారని.. అధికారులతో ఆయన రెండు గంటల పాటు చర్చలు జరిపారని.. సురేఖ ఆరోపిస్తున్నారు. ఇటీవల మంత్రి సురేఖ విదేశాల్లో పర్యటించారు. ఈ సమయంలోనే కడియం తన శాఖ(దేవదాయ)కు చెందిన అధికారులతో సమీక్షించారన్నది సురేఖ ఆరోపణ. ఇది రూల్ ఆఫ్ బిజినెస్‌ను అతిక్రమించడమేనని ఆమె చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సురేఖ లేఖ రాశారు. కడియం శ్రీహరి తన శాఖపై సమీక్ష నిర్వహించడం సరికాదని, ఆయనపై చార్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. అధికారిక కార్యక్రమల్లో పాల్గొనడంతోపాటు.. ఒక మంత్రికి చెందిన శాఖపై సమీక్ష నిర్వహించడం కూడా సరికాదని.. ఇది చట్ట నిబంధనలతో పాటు మంత్రులకు ఉండే ఎక్స్ అఫిషియో నిబంధనలను కూడా ఉల్లంఘించడమేన ని ఘాటుగా పేర్కొన్నారు. సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు.
కాగా.. మరోవైపు కడియం కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. తాను ఎవరితోనూ సమీక్షలు నిర్వహించలేదన్నారు. అయితే.. తాను మాత్రం.. దేవదాయ శాఖ అధికారులతో భేటీ అయిన వాస్తవమేన ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. నివేదిక వివరణ ఇచ్చేందుకు తాను రెడీగానే ఉన్నానని.. సీఎం పిలిస్తే.. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయనకు వివరిస్తానని కడియం పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎంకు ఈ ఇద్దరి వ్యవహారం తలనొప్పిగా మారడం గమనార్హం.

