ఈ నెలలో రాబోతున్న చిత్రాలలో ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా ప్రత్యేకంగా నిర్మించబడింది. ‘బేబీ’తో ఎవ్వరూ ఊహించని విజయాన్నందుకున్న సాయి రాజేష్.. ఈసారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘బేబీ’ తర్వాత ఎస్కేఎన్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ లాంటి చక్కటి జంట లీడ్ రోల్స్ చేసింది.
ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో మొదలుపెట్టి ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. ఇప్పటికే మూవీకి మంచి బజ్ క్రియేట్ కాగా.. రిలీజ్ దగ్గరపడేసరికి ఇంకా హైప్ వస్తుందని. ఐతే ఈ సినిమా కథంతా నడిచేది చెన్నైలోనే కావడం.. హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ తమిళంలో రిలీజ్ చేయబోతున్న టీం. కానీ తమిళంలో ‘చెన్నై లవ్ స్టోరీ’కి పెద్ద అడ్డంకి తప్పేలా లేదు.
సీఎం విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆ డేట్ పక్కా అని అంటున్నారు. తాజాగా కెనడా డిస్ట్రిబ్యూటర్ కూడా రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ పోస్టర్ వదిలాడు. దీనితో 24న సినిమా రాబోతున్నట్లే. ‘జననాయకన్’ 24న రిలీజైందంటే తమిళనాట పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో తమిళనాడు అవతల ముఖ్యమైన నగరాల్లో కూడా ఈ సినిమా సందడి బాగానే ఉండొచ్చు.
దేశాల్లో కూడా ‘జననాయకన్’ భారీ స్థాయిలో విడుదలవుతుంది. అన్ని చోట్లా అదే రోజు విడుదల కాబోయే ‘చెన్నై లవ్ స్టోరీ’కి గట్టి పోటీ తప్పదు. తమిళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో తమిళనాడులోనూ ఈ సినిమా బాగా ప్రభావం చూపుతుందని మేకర్స్ ఆశించారు. కానీ ‘జననాయకన్’ ఉండగా దీని వైపు దృష్టి మళ్లడం కష్టమే. అలా అని టీం రిలీజ్ డేట్ను వాయిదా వేసే పరిస్థితి లేదు. ప్రధాన మార్కెట్ అయిన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గట్టి ప్రభావమే చూపుతుందని. కాబట్టి 24న సినిమా రిలీజ్ కావడం ఖాయం.

