టాలీవుడ్లో ఉపాధి అవకాశాల పేరుతో జరిగే మోసాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో చీటింగ్ కేసు నమోదైంది.
తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి.. పలు దఫాలుగా దాదాపు రూ. 3.5 కోట్లు వసూలు చేసిన బాధితుడి తండ్రి హనుమంతరావు పోలీసులను ఆశ్రయించారు. భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నప్పటికీ, చెప్పినట్టుగానే అవకాశం కల్పించలేదని.. పైగా ఆ డబ్బును తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా వేధిస్తున్నారని హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు.. దర్శకుడు అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మోసం, నమ్మకద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇంకా చదవండి: రష్మిక మందన్న: ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన రష్మిక..
కేసులో ఇరుక్కున్న దర్శకుడు అశోక్ బాబు గతంలో నాని హీరోగా సూపర్ హిట్ చిత్రం ‘పిల్ల జమిందార్’, అనుష్క నటించిన భాగమతి , ఆకాశరామన్న వంటి చిత్రాలకు పనిచేశారు. పరిశ్రమలో గుర్తింపు ఉన్న దర్శకుడే ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

