హైదరాబాద్ ఫుట్‌పాత్ ర్యాంకింగ్ 2026: మన దేశంలో చాలా వరకు ఫుట్‌పాత్ లు ఆక్రమణకు గురై ఉంటాయి. ఈ నేపథ్యంలో
ప్రధాన నగరాల్లో పాదచారులకు అనుకూలమైన ఫుట్‌పాత్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ ఓ నివేదికను విడుదల చేసింది. పాదచారులకు సురక్షితంగా, నడిచే ఫుట్‌పాత్‌లు ఎంత మేర అందుబాటులో ఉన్నాయో ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో అనుకూలమైన ఫుట్‌పాత్‌లు ఈ నగరంలో ఉన్నాయో చూద్దాం..
స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ ప్రకారం..ఫుట్‌పాత్‌ల నిర్వహణ దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌ల శాతం
లక్నో 28%, బెంగళూరు 25.9%,హైదరాబాద్ 15.1%, చెన్నై 13.9%, ముంబై, 5.5% గా ఉన్నాయి. ఇతర నగరాలతో లక్నోలో పాదచారుల కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల మొదటి స్థానంలో నిలిచింది. నగర ప్రణాళికలో పాదచారుల అవసరాలకు ఎంపిక ఈ విజయానికి ప్రధాన కారణం.
ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు25.9 శాతం ఫుట్‌పాత్‌లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 5.1 శాతంతో మూడో1ని దక్కించుకుంది. నగరంలో కొన్ని ప్రధాన ముంబైపై ఆధునిక ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చెందినప్పటికీ, ఇంకా విస్తృత స్థాయిలో మెరుగుదల అవసరమని నివేదిక సూచించింది.చెన్నై 13.9 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, దేశ ఆర్థిక రాజధాని కేవలం 5.5 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. అధిక జనసాంద్రత, బోర్డుపై ఆక్రమణలు, పరిమిత స్థలం వంటి కారణాల వల్ల ముంబైలో పాదచారులకు అనువైన ఫుట్పాట్లు చాలా తక్కువగా గుర్తించబడ్డాయి.
భారత నగరాల్లో ఎక్కువ మంది రోజూ నడిచి ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, వారికి తగిన ఫుట్‌పాత్‌లు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలు, పార్కింగ్, నిర్మాణ పనులు, అసమానమైన ఫుట్‌పాత్‌లు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని నివేదిక.
నివేదిక సూచించిన మార్గదర్శకాలు
పాదచారులకు అనుకూలమైన నగరాల అభివృద్ధి కోసం అన్ని నగరాల్లో వెడల్పైన, నిరంతరాయంగా కొనసాగుతున్న ఫుట్పాట్లు, దివ్యాంగులకు అనువైన ర్యాంపులు, జీబ్రా క్రాసింగ్‌లు, సురక్షిత రోడ్డు దాటే సౌకర్యాలు, మెరుగైన వీధి లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ నివేదిక పేర్కొంది. పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నగరాలు నిజమైన అర్థంలో ప్రజలకు అనుకూలంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

