ఖమ్మం : 2029 ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాసిపెట్టుకో కేసీఆర్ అని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు కాంగ్రెస్ దే అన్నారు. ఖమ్మం జిల్లా గడ్డ మీద నుంచి చెబుతున్నానని, దీనిని ఎవరూ మార్చలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పెనలా మరోసారి అధికారంలోకి వస్తుందని, అందుకే నేటి నుంచి పద్దెనిమిది గంటల పాటు ప్రతి ఒక్కరం పనిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. నాడు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు సీట్లు రావని తాను చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఈసారి తెలంగాణ ఎన్నికలు 2029 జూన్ లోనే జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనను చూసిన ప్రజలు నేడు ప్రజా పాలనను చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ను మళ్లీ మొలకెత్తనియ్యబోమని శపథం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు స్థానాలు 26, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని చెప్పారు. ఆ పాపాల భైరవుడికి ఇక విముక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 117 స్థానాల్లోగెలచి కాంగ్రెస్ మరోసారి అధకారంలోకి రావడం ఖాయమని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. నాడు కేసీఆర్ వరి వేస్తే ఉరి వేసుకుంటే అని కేసీఆర్ అంటే.. కాంగ్రెస్ మాత్రం సన్నఒడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

