సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్ ఫీల్ ఇస్తుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీతో సమంత ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన విషయాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అఖిల్ అక్కినేని, సమంత ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ట్రైలర్ పై అఖిల్ ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. తాను ఇంకా ఆ సినిమా చూడనప్పటికీ, ట్రైలర్ లోని వైబ్ తనకు బాగా నచ్చిందని చెబుతూ సమంతతో పాటు చిత్ర యూనిట్ కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. సినిమాపై అఖిల్ ఈ రేంజ్ లో పాజిటివ్ కామెంట్స్ చేయడం నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది.
అఖిల్ ఇచ్చిన ఈ సపోర్ట్ కు సమంత కూడా అంతే పద్ధతిగా రియాక్ట్ అయింది. అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ థియేటర్లలోకి వచ్చిన రోజే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పింది. ఈ సినిమా ట్రైలర్ ను షేర్ చేస్తూ.. అఖిల్ కు, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్.. అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయంటూ ఒక స్పెషల్ నోట్ రాసుకొచ్చింది.
ఎవరూ ఊహించని ఈ సపోర్ట్ అటు అక్కినేని అభిమానులతో పాటు ఇటు సమంత ఫ్యాన్స్ కు కూడా భలే కిక్ ఇస్తోంది. గతంలో ఏం జరిగినా సరే, కెరీర్ పరంగా ఒకరినొకరు ఇలా ఎంకరేజ్ చేయడం వాళ్ళ మెచ్యురిటీని చూపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ స్వీట్ ఇంటరాక్షన్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ట్రెండ్ అవుతోంది. ఇక అఖిల్ లెనిన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి కోరుకున్న బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

