ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా ఒక విలన్ పాత్రతో మేజిక్ చేయడం దర్శకుడు ఆదిత్య ధర్ వల్లే సాధ్యమైంది. దీని దెబ్బకే అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసి 3 వదులుకున్నారనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో తెగ తిరిగింది. తను ఉన్నాడంటే తమ ప్రాజెక్టుకి అదనపు క్రేజ్ వస్తుందనే నమ్మకం నిర్మాతల్లో బలంగా ఉంది.
ఇంత ఇమేజ్ సంపాదించుకున్న అక్షయ్ ఖన్నా కొత్త మూవీ ఇక్కడ నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రిలీజైంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటం వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా. నిజాయితీ కలిగిన లాయర్ అర్జున్ (సన్నీ డియోల్) కూతురి ప్రాణం కోసం మర్డర్ కేసులో ఇరుక్కున్న కోటీశ్వరుడి శౌర్యమాన్ (అక్షయ్ ఖన్నా) తరపున వాదిస్తాడు. ఎన్నో మలుపులు తిరిగిన కేసు ఊహించని మలుపు తీసుకుంటుంది.
సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఇకా బెస్ట్ యాక్టర్స్ టూ మ్యాన్ షోలా నడుస్తుంది. అక్షయ్ ఖన్నా ఒళ్ళంతా పొగరు నిండిన పెద్దింటి వాడిగా మరోసారి విలన్ షేడ్స్ పోషించే, సన్నీ డియోల్ తనదైన శైలిలో న్యాయవాది క్యారెక్టర్ ని నిలబెట్టారు. అయితే కథనం మరీ ఎంగేజింగ్ గా లేకపోవడం, రెండు ట్విస్టులు తప్ప మిగిలాయి రొటీన్ గాడం వల్ల ఇక ప్రత్యేకంగా అనిపించలేదు. ఈ జానర్ కు మీరు వీరాభిమానులైతే తప్ప నచ్చడం కష్టం.
గత కొన్నేళ్లలో అన్ని భాషల్లో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా వచ్చేయడంతో ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏమి లేదు. అక్షయ్ ఖన్నా మరోసారి తన మ్యానరిజమ్స్ తో పండించే ప్రయత్నం చేశారు కానీ కొన్నిసార్లు రెహమాన్ డెకాయిట్ తాలూకు ప్రభావమే తెరమీద కనిపించడం కొంత మైనస్ అయ్యింది. 2 గంటల 20 నిమిషాల నిడివిలో ల్యాగ్ ఉంది. సన్నీ, అక్షయ్‌తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నటించిన తిలోత్తమ షోలో మరో ఆకట్టుకునే అంశం.

