Allu Arjun Politics : ఈరోజు ఉదయం నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఏంటి ?, రాజకీయాల్లోకి రావడం ఏంటి?, చాలా విడ్డూరంగా ఉందే, పాన్ ఇండియా లెవెల్ లో భారీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ , పీక్ రేంజ్ కెరీర్ వదులుకొని ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అసలు వచ్చే సూచనలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదే?, అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఈ వార్త ని ప్రచురించింది ఒక టాప్ వెబ్ సైట్, ఒక రాజకీయ పార్టీ కి చెందినది కాబట్టే, ఈ రేంజ్ లో సీరియస్ గా తీసుకున్న నెటిజెన్స్. అంతే కాదు , ఆ వెబ్ సైట్ కి వచ్చిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై లో ప్రశాంత్ కిషోర్ ని కలిశారట.
2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడానికి , అదే విధంగా ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సినీ నటుడు విజయ్ సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఏ రేంజ్ లో పనికొచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతనితో అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయమని రిక్వెస్ట్ చేశారట. కాదు , అల్ అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కూడా రాజకీయ పరంగా చాలా ప్రోత్సాహాన్ని అందజేసినట్లు చెప్పుకొచ్చింది అదే వెబ్ సైట్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందించింది. అల్లు అర్జున్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర మాట్లాడుతూ ‘మీరు ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ రిప్లై ఇచ్చారు.
దీంతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తల ప్రచారానికి చెక్ పడింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని పెద్దలు అంటుంటారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి చర్చలు జరగకపోతే , ఇలాంటి వార్తలు ఈ సమయం లో ఎందుకు వస్తాయి అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు నెటిజెన్స్.
ఈ సమాచారంలో వాస్తవం లేదు.
– శరత్ చంద్ర నాయుడు (@imsarathchandra) జూలై 10, 2026

