చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడి బజ్జీలు తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. అందుకే ఈ వారం మీకోసం వెరైటీ బజ్జీల్ని తెచ్చేశాం. కూరగాయలు, పండ్లతో ఈ బజ్జీలను మీరూ ట్రై చేయండి
టొమాటో బజ్జీ తయారీకి కావాల్సినవి:
- టొమాటోలు (చిన్నవి)- ఆరు
- పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు-తగినంత
- వంటసోడ –కొద్దిగా
- – డీప్ ఫ్రైకి నూనె సరిపడ
- శెనగపిండి- ఒక కప్పు
- బియ్యప్పిండి- ఒక కప్పు
- కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టీస్పూన్
- కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్
- కరివేపాకు- ఒక చెమ్మ
- నిమ్మరసం- ఒక టీస్పూన్
- పల్లీలు- అరకప్పు
టొమాటో బజ్జీ తయారీ విధానం
టొమాటోలు శుభ్రంగా కడగాలి. గిన్నెలో శనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి టొమాటోలను పిండిలో ముంచి, నూనెలో వేసి దొరగా వేగించాలి తర్వాత మరొక గిన్నెలో కరివేపాకు కొత్తిమీర, ఉల్లిగడ్డ తరుగు, నిమ్మరసం. ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. చివర్లో బజ్జీలను మధ్యకు కొద్దిగా కోసి, ఉల్లితరుగు మిశ్రమం కొద్దిగా స్టఫ్ చేసి పల్లీలు పైనుంది చల్లాలి.
పైనాపిల్‌తో బజ్జీలు తయారీకికావాల్సినవి
- పైనాపిల్ ముక్కలు- ఆరు
- ఉప్పు-తగినంత
- బేకింగ్ సోడా – చిటికెడు
- గుడ్డు సొన- ఒక టీ స్పూన్
- నూనె- డీ ఫ్రైకి సరిపడ
- పంచదార- ఒక టేబుల్ స్పూన్
పైనాపిల్‌తో బజ్జీలు తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, ఉప్పు, బేకింగ్ షోడ, గుడ్డు సొన, పంచదార వేసి, సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలపాలి. పైనాపిల్ ముక్కలను పిండిలో ముంచి, మరుగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి.
ఉల్లి బజ్జీ తయారీకి కావాల్సినవి
- శెనగపిండి- ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు చక్రాల్లాతరగాలి) –ఒక కప్పు
- మైదా- ఒక టీ స్పూన్
- వంటసోద- కొద్దిగా
- ఉప్పు-తగినంత
- నల్ల ఉప్పు- చిటికెడు
- కారం- ఒక టీ స్పూన్
- కొత్తిమీర- చిన్నకట్ట
- పచ్చిమిర్చి- నాలుగు
- – డీప్ ఫ్రైకి నూనె సరిపడ
- అంచూర్, ధనియా పొడి- ఒక్కో టీస్పూన్ చొప్పున
ఉల్లి బజ్జీ తయారీవిధానం
ఒక గిన్నెలో శనగపిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.. ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వడగట్టాలి. ఆ నీళ్లు శెనగపిండి మిశ్రమంలో పోయాలి, ఉప్పు, వంటసోడా, కారం, నల్ల ఉప్పు వేసి జారుగా కలపాలి. ఉల్లి చక్రాలు పిండిలో ముంచి నూనెలో వేసి వేగించాలి. చిన్న గిన్నెలో ఆమె చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి సర్వ్ చేసుకోవాలి.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సూపర్ స్నాక్స్: వెరైటీ బజ్జీలు.. పైనాపిల్.. టమాటా .. ఉల్లితో ఇలా తయారు చేసుకోండి..”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

