పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పృశించారు. తాను చెప్పిన మాటకే కట్టబడి ఉన్నానన్నారు. దీనిని భవిష్యత్తులో తాను నిజం చేస్తానని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జనాభాను నియంత్రించడం సరికాదని తేల్చి చెప్పారు. జనాభాను సంరక్షించే విధానాలు రావాల్సిన అవసరం ఉందని కచ్చితంగా. రాష్ట్రంలో ఈ దిశలోనే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఉత్తమ విద్య, ఆర్థిక వనరుల పెంపు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముగ్గురు బిడ్డలను కంటే 30 వేలు, నలుగురు పిల్లలను కంటే 40 వేల చొప్పున ఇవ్వని మరోసారి చెప్పారు.
విజయవాడలో శనివారం నిర్వహించిన `ప్రపంచ జనాభా దినోత్సవం`లో ముఖ్య మంత్రి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు తాను కూడా ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. కానీ, నేడు సంపదగా చెబుతున్నానన్నారు. ఆదాయ వనరులు పెరుగుతున్నాయని.. పిల్లలుకూడా అందులో భాగమేనని. గతంలో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించని, కానీ, ఇప్పుడు ఆ నిబంధనను తాము ఎత్తేశామని, ఎంతమంది పిల్లలు ఉన్నా.. అందరూ అర్హులేనని చెప్పారు.
ఆడపిల్లలు భారం కాదు!
ఒకప్పుడు ఆడపిల్లలు అంటే మధ్యస్థ’గతి కుటుంబాలు వారు భారంగా భావించే వార’ని, దీనికి కారణాలు అనేకం ఉన్నాయ’ని సీఎం చెప్పారు. అయితే, మారుతున్న కాలంతోపాటు.. అధునాత సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. దీనితో ఆడపిల్లలు కూడా ఉన్న’త విద్య’లు చదువుతున్నార’ని, ఉన్న’త ఉద్యోగాలు కూడా చేస్తున్నార’ని తెలిపారు. ఇప్పుడు కట్నం ఇచ్చే పరిస్థితి పోయిందని, ఎదురు కట్నం ఇచ్చే రోజులు వచ్చాయని చమత్కరించారు. ప్రస్తుతం ఇద్దరు కాదు.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత సంపద ఉన్నట్టేనని అన్నారు. దేశంలోను, రాష్ట్రంలోనూ ఆ తరహా ఆలోచన రావాలని సూచించారు.
వృద్ధులు పెరుగుతున్నారు!
దేశంలో వృద్ధుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో బారీగా పెరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది పెను సవాల్‌గా మారుతుందన్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అక్కడ పిల్లలను కంటే పథకాలను అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనదేశంలో ఇప్పుడే ఈ విషయంపై చర్చ జరగాలని తాను పిలుపునిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళనకరమని సూచించింది. పిల్లలు వదద్దని అనుకుంటే.. సంపద’ వదద్దని అనుకున్న’ట్టేన’ని చప్పారు. పిల్ల’లను పెంచే బాధ్యత’ను తండ్రులు కూడా తీసుకోవాల’ని సూచించారు. “ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. స్వర్ణాంధ్ర -2047 కాదు.. స్వర్ణాంధ్ర -2040కే సాధిస్తామన్న భావన కలుగుతోంది“ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

