SIR ఫారం పేరుతో కేటుగాళ్లు మోసాలకు చేస్తున్నారు. ఓటు హక్కు పదిలంగా ఉండేందుకు ‘సర్’ ప్రక్రియలో ‘ఎన్యుమరేషన్ ఫారం’ అత్యంత కీలకంగా మారింది. ఈ ఫారంలో ఏ భాగంలో ఏ వివరాలు నమోదు చేయాలి ? ఒకవేళ జాబితాలో పేరు ఉంటే ఏం చేయాలి ? లేకపోతే ఏం చేయాలి? అనే వివరాలు పరిశీలిద్దాం. ఎన్యుమరేషన్ ఫారంలోని పై భాగంలో ఓటరుకు సంబంధించిన ప్రాథమిక సమాచారమంతా ముందే ముద్రించి ఉంటుంది.
ప్రస్తుతం ఎలక్టోరల్ రోల్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. ఓటరు పేరు, నియోజకవర్గం, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు ఫొటోతో సహా స్పష్టంగా ఉంటాయి. వీటితో పాటు ఓటర్లకు సందేహాలుంటే సంప్రదించడానికి వీలుగా సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) పేరు, వారి ఫోన్ నంబరును కూడా అందులోనే ముద్రించారు. అయితే.. ఈ ఫారం నింపాక తెలియని నంబర్ నుంచి కేటుగాళ్లు కాల్ చేసి స్కామ్‌కు చేసినట్లు తెలిసింది.
ఈ స్కామ్ ఏమిటి ?
1. సందర్భం: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో SIR – ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఏర్పాటు. 18 ఏళ్లు పైబడిన అందరి పేర్లు ఉండేలా మరియు అక్రమ ఓటర్లను తొలగించే ఉద్దేశ్యం.
మోసగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు ?
- SIR ఫారం నింపిన తర్వాత మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.
- కాల్ చేసే వ్యక్తి తను BLO-బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు.
- “2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పండి” అని అడుగుతాడు.
- ఒక్కసారి OTP చెప్పారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది.
ముఖ్యమైన హెచ్చరికలు:
- ECI/BLO ఎవరూ ఫోన్లో OTP అడగరు.
- ఎవరికీ OTP ఇవ్వకండి.
- OTP కోసం బెదిరిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
- భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే రిపోర్ట్ అయింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారులలా నటించి “SIR.apk” లింక్ పంపి డేటా దొంగిలిస్తున్నారు.
ఏం చేయాలి ?
►ఇంకా చదవండి | ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై బుక్కైన కేసు!
- ఈ కుటుంబం, స్నేహితులు అందరికీ షేర్ చేయండి.
- అధికారిక ECI ప్రకటన ద్వారా మాత్రమే వెరిఫై చేసుకోండి. ఫోన్లో OTP/బ్యాంక్ వివరాలు ఇవ్వకండి.
- బెదిరింపు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
- గుర్తుంచుకోండి: 1 OTP = మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.
- జాగ్రత్తగా ఉండండి.

