సర్ ముగిసిన వెంటనే ఎన్నికలకు సన్నాహాలు
వీడియో కాన్ఫరెన్స్లో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
అమరావతి: స్థానిక పోరుకు సీఎం సంకేతాలిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేసిన వెంటనే… సెప్టెంబరు నెలాఖరులో లేదా అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు. పార్టీల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ కూటమి సమావేశాన్ని 15న నిర్వహించాలని నిర్ణయించారు. జోన్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. పార్టీ ఇంచార్జి¨లు లేని నియోజకవర్గాలకు త్వరలో నియమిస్తామని, కొత్తవారు కూటమి శ్రేణులతో కలిసి నడవాలని తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలు, జోనల్ కోఆర్డినేటర్లతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తిప్పికొట్టడం, సర్, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో అభివృద్ధి, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై ‘రాయలసీమ రైజింగ్’ పేరుతో ప్రచారం.

