హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణకు ఖరీదైన కెమెరాలు తీసుకని రూ.1.80 కోట్లు బకాయిలు చెల్లించకుండా మోసం చేసినట్లు ఆర్యతో పాటు (జింపాడ్ పా) చిత్ర బృందంపై కేసు పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘అనంతన్ కాడు’అనే హీరో ఆర్య, నిర్మాత వినోద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పలుమార్లు జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలోని హైలాంకాలనీలోని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించి చిత్రీకరణకు అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు, ఇతర పరికరాలను అందించాలని తెలిపారు. అద్దె మొన్నీ పూర్తి స్థాయిలో చెల్లిస్తామని, ఎలాంటి బకాయిలు ఉండవని పదే హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 25వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కేరళకు ఖరీదూర పరికరాలను సొంత ఖర్చుతో తరలించింది.
చిత్రీకరణ పూర్తయ్యే వరకు సంస్థ అందించిన పరికరాలను వినియోగించుకున్నా ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.2.12 కోట్లలో రూ.1.80 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదు. బకాయిలు ఇచ్చిన హామీ లిఖితపూర్వకంగా అంగీకరించి, సినిమా విడుదల ముందే చెల్లడించి ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ తీసుకుంటామని హామీ ఇచ్చా దాన్ని నిలబెట్టుకోలేదు. బకాయిల చెల్లింపులపై పలుమార్లు లేఖలు, వాట్సప్‌లు, ఫోన్ కాల్స్ గుర్తు చేసినా స్పందించలేదని, కేరళలో కోర్టులను ఆశ్రయించి వాస్తవాలను పెట్టి దాచిపెట్టిన సందేశాన్ని కూడా తెచ్చుకున్నారని ఆ సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఇదిలా బకాయిల కోసం సంప్రదించిన తమ సంస్థ మేనేజర్ నిర్మాత వినోద్, హీరో ఆర్య, వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

