ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు. ఇక ఎప్పుడు ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక కెరియర్ స్టార్టింగ్ లో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక నటుడు ప్రభాస్ ని తిట్టారట. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే కృష్ణంరాజు కావడం విశేషం… వీళ్ళిద్దరు కలిసి ‘బిల్లా’ సినిమాలో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ కి ఎలా నటించాలో అర్థంకాక చిన్నపాటి కన్ఫ్యూజన్లో ఉండేవారట. దానికి కృష్ణంరాజు ప్రభాస్ కి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ బిల్లా ఎలా ఉండాలి. ఆయన క్యారెక్టరైజేషన్ ను ప్రభాస్ కి వివరిస్తూ అతన్ని పర్ఫెక్ట్ గా నిలబెట్టే ప్రయత్నం చేశారట.
ఇక ఏది ఏమైనా కూడా బిల్లా సినిమాలో వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. కృష్ణం రాజు ఎప్పుడు ప్రభాస్ ని చిన్నపిల్లాడి లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. నటన విషయంలో ఎప్పుడు ప్రభాస్ ని తిడుతూ అతనికి మేలుకోలు చెబుతూ ఉండేవాడు.
ప్రభాస్ యాక్టింగ్ బాగా చేసినప్పుడు గర్వపడుతూ ఉండేవాడట. ఇక ప్రభాస్ సైతం వాళ్ల పెదనాన్న చెప్పినట్టుగానే వింటూ ప్రతి క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. ప్రభాస్ చెప్పింది వింటాడు కాబట్టే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అతనంటే చాలా ఇష్టమట…
ఏది ఏమైనా కృష్ణంరాజు ప్రస్తుతం ప్రభాస్ తో లేకపోయినప్పటికి ఆయన మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన లెగిసిని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ ముందుకు సాగుతున్నాడు… ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ తన సినిమాలతో ప్రేక్షకులందరికీ మెప్పించడానికి ప్రయత్నించడం విశేషం…

