సొంత ఇల్లే ఏ మహిళకైనా అత్యంత సురక్షితమైన ప్రదేశం. కానీ, బెంగళూరుకు చెందిన ఒక మహిళకు మాత్రం ఆమె ఇల్లే ఒక పీడకలగా మారింది. ఒక డెలివరీ ఏజెంట్ రూపంలో వచ్చిన వ్యక్తి ఆమె భద్రతనే ప్రశ్నార్థకం చేశాడు. "సహాయం" అనే మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక మహిళపై వేధింపులకు గురైన ఈ ఘటన ఐటీ సిటీలో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టింది. ఎప్పటిలాగే పార్సెల్ ఇవ్వడానికి డెలివరీ ఏజెంట్ ఆమె ఫ్లాట్ తలుపు తట్టాడు. పార్సెల్ ఇచ్చేసిన, తనకు అత్యవసరంగా ఉందని, ఒకసారి టాయిలెట్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఆ మహిళను కోరాడు. వాళ్లను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి రానివ్వడం క్షేమం కాదని భావించిన ఆ మహిళ.. అందుకు నిరాకరించింది. దయచేసి పక్క ఫ్లాట్‌లో ఉన్న వాళ్లను అడగండి అని చాలా స్పష్టంగా చెప్పింది.
బలవంతంగా ఇంటికి
ఆమె ‘వద్దు’ అని పదేపదే మొత్తుకుంటున్నా.. ఆ డెలివరీ ఏజెంట్ వినలేదు. తన చెప్పులు బయట విప్పేసి, ఆమె అనుమతి లేకుండా బలవంతంగా ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లి టాయిలెట్ వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా, బయటకు వచ్చిన తర్వాత ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసేలా అసభ్యంగా ప్రవర్తించాడు.
బాధిత మహిళ ఆవేదన
అతను అలా ప్రవర్తించేసరికి నేను షాకయ్యాను. నా సొంత ఇంట్లోనే నాకు తీవ్రమైన అవమానం, అభద్రతా భావం కలిగాయి. ఒక మహిళ ‘వద్దు’ అన్నప్పుడు ఆ మాటతో ముగిసిపోవాలి. ఒకరి హద్దులను దాటి, ఇంట్లోకి బలవంతంగా దూసుకురావడానికి ఎవరికీ హక్కు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని..
ఆ భయానక క్షణాల్లో కూడా ఆ మహిళ ఎంతో ధైర్యం, తెలివిని పదర్శించింది. పరిస్థితి మరింత దారుణంగా మారితే తప్పించుకోవడానికి వీలుగా.. ఆమె వెంటనే ఫ్లాట్ మెయిన్ డోర్‌ను పూర్తిగా తెరిచి పెట్టింది. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే కేకలు వేస్తూ బయటకు పరుగెత్తినట్లు చేసింది. అంతేకాదు, ఏం జరిగిన సాక్ష్యం ఉండాలని తన ఫోన్ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ మోడ్‌లో ఉంచి, చేతిలో పట్టుకుంది. నిత్యం పేపర్లలో, టీవీల్లో మహిళలపై జరిగే ఘోరాలు గుర్తొచ్చి ఆ క్షణంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపానని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
నిందితుడు అరెస్ట్
ఈ ఘటనపై సోషల్ మీడియాలో వచ్చిన బెంగళూరు పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మారతహళ్లి పోలీసులు సుమోటోగా స్పందించి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన డెలివరీ ఏజెంట్ విజయ్ మల్లికార్జున్ కామత్ ను వెంటనే అరెస్ట్ చేశారు.
ఫ్లిప్‌కార్ట్ స్పందన
ఈ దారుణంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా స్పందించింది. "మా డెలివరీ పార్టనర్ ఇలా ప్రవర్తించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి సంఘటనలను మేము అస్సలు సహించం. కేసు పూర్తి విచారణ జరిపి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని కంపెనీ ఒక ప్రకటనలో హామీ ఇచ్చింది. ఈ ఘటన నగరాల్లో ఒంటరిగా ఉండే మహిళల భద్రతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. టెక్నాలజీ ఎంత పెరిగినా.. అపరిచితుల విషయంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన హెచ్చరిస్తోంది.
బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ ఒక మహిళ పదే పదే చెప్పినప్పటికీ ఆమె ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించాడు "నం". అతను ఆమె సరిహద్దులను విస్మరించాడు, ఆమె వాష్‌రూమ్‌లోకి ప్రవేశించాడు, ఆపై ఆమెకు తనను తాను బహిర్గతం చేశాడు.
ఆమె తన ఇంట్లోనే భయాందోళనకు గురైంది. ప్రాణ భయంతో ఆమె కెమెరాను ఆన్ & డోర్ తెరిచి ఉంచింది.
ఒక… pic.twitter.com/JQHScytaCT— జిద్ది నగర్ (@ZiddiNaagrik) జూలై 11, 2026
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బెంగళూరులో దారుణం: ఇంట్లోనే మహిళకు రక్షణ ఏది ? వాష్‌రూమ్ సాకుతో డెలివరీ బాయ్ అరాచకం!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

