- సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్
- రైతుల కోసం రక్తమిస్తామన్న జగదీశ్
- నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని నిలదీత
- రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్
Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము ప్రాణాలను పణంగా పెట్టి పోరాటంలోకి వచ్చామని గుర్తుచేసిన ఆయన, తమ రక్తంతో పంటలు పండేందుకు ప్రజలు భావిస్తున్న రైతుల కోసం కేసీఆర్తో పాటు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో కరువు వచ్చే ముప్పు ఉందని, నీటిని ఎత్తిపోయామని తాము నెత్తినోరూ బాదుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ శుద్ధ అబద్ధాలని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద దాదాపు 10 టీఎంసీల నీరు వృధాగా పోతున్న ప్రభుత్వం ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. గోదావరి ఉధృతికి భద్రాచలం కొట్టుకుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు తలదించుకుంటున్నారని. రైతుల పొలాలకు నీళ్లివ్వడం చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విపక్షాలపై బురదజల్లుతోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.

